సాగర్‌కు స్మితా సబర్వాల్‌..సీఎం కేసీఆర్‌ ఆదేశం

నవతెలంగాణ-హైదరాబాద్ : నాగార్జునసాగర్ డ్యాంలోని 13 గేట్లను ఏపీ పోలీసులు ఆక్రమించడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సాగర్ లో రాకపోకల నియంత్రణ, బలవంతంగా నీటి విడుదల పరిణామాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుగా సాగర్ ను సందర్శించాలని సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ ను ఆదేశించారు. కాసేపట్లో ఆమె అక్కడకు చేరుకుని సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు ఇవాళ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేయనున్నట్లు సమాచారం . ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకోగా.. ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 522 అడుగులకు చేరింది. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love