నేడు కాంగ్రెస్‌లోకి తుమ్మల

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు శుక్రవారం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లారు. పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, యెన్నం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Spread the love