మిగిలిన వారికి త్వరలో రైతు భరోసా: తుమ్మల

నవతెలంగాణ- హైదరాబాద్ : జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లను జమ చేసినట్లు వివరించారు. మిగిలిన వారికీ త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.

Spread the love