నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ గ్రామ పెద్దలు సామాజిక కార్యకర్త ఆర్యా సమాజ్ అధ్యక్షులు రమేష్ సెట్ తమ్మేవార్ 81 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు రాలు జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అరుణ తార రమేష్ సెట్ కుటుంబ సభ్యులకు శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు బి హన్మాండ్లు, కంచిన్ వార్ యాదవ రావు, తెప్పవార్ తుకరం, కృష్ణ పటేల్, ద్యవాడ మాజీ ఉపసర్పంచ్, శ్రీపాద పటేల్, మీర్జాపూర్ గ్యణేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.