– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌కు జాజుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో నియమించబోయే విశ్వవిద్యాలయాల వీసీల నియామకంలో సామాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని మంగళవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం వీసీలను కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీసీల నియామకాల్లో వారికి సముచిత స్థానం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మధు యాదవ్, సంపత్, సమత యాదవ్, శ్యామల, దేవిక, లావణ్య తదితరులు పాల్గొన్నారు.