హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ
నవతెలంగాణ-చేవెళ్ల
చదువుతోనే సామాజిక న్యాయం మొదలవు తుందని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్‌పల్లి చౌరస్తాలోని దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వరహించారు.ఈ కార్యక్ర మాన్నికి ముఖ్య అతిథులుగా హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ అనితహరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాద య్య, ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేశం హాజరై, దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైంతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య కృషి ఎనలేనిదన్నారు. రజాకారుల తుపాకుల గుండ్లకు బెదరని వ్యక్తి దొడ్డి కొమురయ్య అని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన చెందాలంటే విద్య ఒక్కటే ముఖ్యమన్నారు. గొల్ల కురుమల వృత్తులను కాపాడుకుంటూ విద్యను అభ్యసించి ముందుకు సాగాలని విద్యతోనే సామాజిక అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని మంచిగా చదివించి ఉన్నత స్థానంలో నిలిచేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీసీ సంక్షేమ సంఘం సభ్యులు శుభప్రద పటేల్, రాష్ట్ర కురుమ సం ఘం ఉపాధ్య క్షులు సదా నందం, క్యామ మల్లేష్, అరుణోదయ సంఘం సభ్యులు విమలక్క, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయ లక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల కురుమ సంఘం అధ్యక్షులు కసిరే వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు రాపోలు నరసింహులు కురుమ, చేవెళ్ల మండల ఉపాధ్యక్షులు దండు సత్తి కురుమ, బూర్ల సాయినాథ్ కురుమ, ఎర్ర మల్లేష్ కురుమ, ప్రధాన కార్యదర్శి తిరుమల కుమార్ కురుమ, మీడియా ఇన్ చార్జి గొంగుపల్లి రాఘవేందర్ కుర్మ, ఎర్ర నర సింహులు కుర్మ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ కుర్మ, ఎంపీటీసీ రాములు కురుమ, చేవెళ్ల కుర్మ సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
చదువుతోనే సామాజిక న్యాయం
10:29 pm