పాలకవర్గ సభ్యుల సహకారంతో లాభాల బాటలో సొసైటీ..

 

– నీల సొసైటీ చైర్మన్ ఇమామ్ బేగ్..

నవతెలంగాణ- రెంజల్
గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలలో ఉన్న సొసైటీని లాభాల బాటలోకి తీసుకురావడానికి పాలకవర్గ సభ్యుల సహకారం తో నష్టాలనుంచి బయటపడడం జరిగిందని, నీల సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్ స్పష్టం చేశారు. శనివారం రెంజల్ మండలం నీల సొసైటీ చైర్మన్ ఇమాంబేగ్ అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సొసైటీ ద్వారా 900 మంది రైతులకు రుణమాఫీ కావలసి ఉండగా, కేవలం 350 మందికి 72 లక్షల రుణమాఫీ జరిగిందని, మిగతా రైతులకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ సొసైటీకి కోటి రూపాయల వరకు రుణమాఫీ రావాల్సి ఉందన్నారు. తమ సొసైటీ 58 లక్షల రూపాయలు నష్టాల్లో ఉండగా, దానిని 18 లక్షల బాకీ మాత్రమే ఉందన్నారు. నూతనంగా రుణాలు తీసుకునే రైతులకు 45 వేల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆసక్తిగల రైతులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలు, శనగ కొనుగోలు, పొద్దుతిరుగుడు కొనుగోలు ద్వారా 57 లక్షల వరకు సొసైటీ కి  లాభం చేకూరింది అన్నారు. మిగతా రైతులకు రుణమాఫీ చేయాలని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారానే విక్రయించాలని ఆయన కోరారు. రుణాలను రైతులు సకాలంలో చెల్లించి తిరిగి రుణాలను పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నవీపేట్ బలరాం, నూనెల ఆకాష్, లాయ కలిఖాన్, స్థానిక రైతులు రాఘవేందర్, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాఘవాచారి, సుభాష్, భాస్కర్, అక్తర్, విట్టల్, సొసైటీ కార్యదర్శి ఎస్. రాందాస్, సిబ్బంది హర్బాజ్ ,శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love