అధిక ధరలకు శీతల పానీయాలు

– ధరల నియంత్రణ శాఖ అధికారులెక్కడీ
– సామాన్య ప్రజల జీవితాలపైన అధిక ధరల కొరడా
నవతెలంగాణ-కొందుర్గు
ఏం కొనేటట్టు లేదు ఏం తినే టట్టు లేదు లచ్చులో లచ్చన్న ధరలిట్ల పెరగవట్టే లచ్చులో లచ్చన్నా……? అంటు సినిమా పాట ఏ సందర్భంలో రాశారో గాని అది నిజమే అని ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలపైన ఇప్పటికే అధిక ధరల భారం, నిత్యవసర సరుకుల ధరలు చుక్కలను అంటుతున్నాయి. దానికితోడు సగటు మనిషి జీవితాలు చాలా కష్టంగా మారుతున్నాయి. ఆరుగాలం వ్యవసాయం చేస్తూ, పంటను పండిస్తున్న పంట మార్కెట్‌కు వచ్చేలోపు దళారీ వ్యాపారస్తులు మార్కెట్‌లోకి ప్రోడక్షన్‌ బాగా వచ్చింది అంటు పంటను తక్కువరేటుకు కొనుగోలు చేస్తుంటారు. అలాంటిది పంట మొత్తం వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళాక అమాంతం రేటు పెంచేస్తారు ఇది మార్కెట్‌ స్టాటాజీ. కానీ నిత్యం కూలి నాలి చేస్తూ, సామాన్య జీవితం గడుపుతున్న పల్లేటూరు ప్రజల జీవన విధానంపైన ధరల భారం అధికమై, వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అప్పుడప్పుడు వచ్చే పండగలు, పండగలకు వచ్చే ఆడపడుచులు, కొత్తబట్టలు పిండి వంటలు ఇలా సంపాదించినది అంతా పండగలు పబ్బాలంటూ మొత్తం ఖర్చుచేస్తారు సగటు జీవితాలు మరింత కష్టాలు అప్పులు అవుతాయి. మనిషి జీవితం మరింత భారమవుతోంది. ఇదిలా ఉంటే రోజురోజుకూ పెరుగుతున్న అధిక ధరల దోపిడీ నడుమ పేదల జీవితాలు కొట్టుమిట్టడుతున్నాయి. ఈ తతంగం ప్రతీ నిత్యం జరుగుతూనే ఉంటుంది. అదేంటని ప్రశ్నిస్తే నీ ఇష్టం ఉంటే కొనుక్కో లేకుంటే లేదు అంటు దాబాయిస్తారు..
కొందుర్గు మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో ఇదే వరుస ఎండాకాలం వచ్చింది. ఎండలకు అలసిపోయిన జీవితాలు కాస్త గొంతు చల్లబర్చుకోవడానికి శీతల పానియాలు కొనుక్కొని తాగుదాం అంటే అవి ఎమార్పీ రేట్లకు అమ్మాల్సిన కూల్‌ డ్రింక్స్‌ అధిక ధరలకు అమ్ముతున్నారు. ఒక్కో లీటర్‌ అర లీటర్‌ కూల్‌ డ్రింక్స్‌ పైన రూ.5 నుంచి రూ.10లు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ప్రశ్నిస్తే కరెంటు బిల్లు పుణ్యానికి రాలేదు. ఫ్రిడ్జిలో పెట్టి కూలింగ్‌ చేసి ఇవ్వాలి కదా అందుకే ప్రిడ్జి, కరెంటు బిల్లు మొత్తం కలిపి ఇస్తున్నాం అంటూ, ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. టౌన్‌కు దూరంగా ఉన్న గ్రామాల్లో అయితే ఏకంగా రూ.10 నుంచి రూ.15లు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఎక్కడైనా ఏ మారుమూల గ్రామంలోనైనా ఏ కూల్‌ డ్రింక్స్‌ అమ్మినా ఎమ్మార్పీ రెట్లకే అమ్మాలంటూ ( ఇంక్లూడింగ్‌ అల్‌ టాక్సెస్‌ ) అని లిఖిత పూర్వకంగా రాసి ఉంటుంది.అయినా హౌల్‌ సేల్‌ షాప్‌ వాళ్లు రిటైలర్స్‌కి తక్కువ ధరలకు కిరణం షాపులకు అమ్ముతారు. కిరాణ షాప్‌ వాళ్లు మాత్రం కరెంట్‌ అని, ఫ్రిడ్జి అని అన్ని కలిపి ఎమార్పీ ధరకంటే, అధికంగా రూ.10′ 15 లు సామాన్య ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. అయితే సామాన్య ప్రజల అవసరాల మేరకు పోనీ తిరు ఇప్పుడు టౌన్‌కి పోయి తెచ్చుకుంటే కిరాయిలు ఖర్చు అవుతాయికదా ఇక్కడే కొనుక్కుంటే కిరాయిలు మిగుల్తాయి అయిదో పదో ఎక్కువ ఇచ్చి కొందాం అంటు అవసరానికి కొంటుంటారు. వారికి వారే సమర్దించుకుని సర్దుకుంటారు. పల్లెటూళ్లలో ధరల నియంత్రణ లేకపోవడంతో అవగాహనా కల్పించాల్సిన అధికారులు నిద్రవస్థలో ఉంటే చిరు వ్యాపారులు కిరాణాం షాపు వాళ్లు ఎక్కువ ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధిక ధరల నియంత్రణ శాఖ అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో అధిక ధరలకు కూల్‌డ్రింక్స్‌ విక్రయిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని అన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Spread the love