డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఎంపికలో 30 మంది బాలికలను ప్రాబబుల్ కు ఎంపిక చేసినట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు మంగళవారం నుండి ఈ నెల 17 వరకు శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేసి ఈనెల 18 నుంచి 20 వరకు వరంగల్ జిల్లాలో జరిగే రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు పంపనున్నట్లు వారు తెలిపారు.ఈ ఎంపిక కార్యక్రమంలో ప్రిన్సిపల్ టేకులపల్లి నళిని, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత,అకాడమీ కోచ్ లు వి మౌనిక, ఈ నరేష్, వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్రీలత పాల్గొన్నారు.