– ఐదు వేలు ఆర్థిక సహయం అందజేత
నవతెలంగాణ దుబ్బాక రూరల్
ఉమ్మడి దుబ్బాక మండలం( అక్బర్ పేట భూంపల్లి మండల) పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన అవుసుల రాములు చారి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని గురువారం వారి కుటుంబానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రామలింగారెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చిట్టాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యదర్శి ర్యాకం శ్రీరాములు,మాజీ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పెంటి కిషన్, బిఆర్ఎస్ నాయకులు మంతూరి శ్రీనివాస్, జంగి సత్యనారాయణ, కమటం రవి, సిద్ధిని యాదయ్య, నర్సింహచారి, సిద్ధిని రాజమల్లు, జంగీ కిషోర్,జంగి సతీష్, కమటం రాజు తదితరులు ఉన్నారు.