నవతెలంగాణ – భైంసా
ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశం లో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముధోల్ నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు. బాసర ట్రిపుల్ ఐటీ లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, 1500 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ గా పరిగణించాలని, కోరారు. ట్రిబుల్ ఐటీ లో విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా బైంసా ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లో వోల్టేజ్ సమస్యతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుబీర్ 132 కె. వి. సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. గత ప్రభుత్వ హాయంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు వారికి ఇల్లు కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలన్నారు. భైంసా డిపో లో ఆర్టీసీ బస్సులను పెంచి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. దీంతో పాటు పలు విషయాలపై ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారు.