భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కమిటీ సమావేశం శుక్రవారం మర్యాల గ్రామంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బోలాగని సత్యనారాయణ హాజరై అనంతరం వారు మాట్లాడుతూ….ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసి కట్టించాలని, దరఖాస్తులు పెట్టుకున్న నూతన రేషన్ కార్డులు లేని వారికి ఇవ్వాలని, పేదలకు ఇండ్లు, పట్టా ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్లు లేని గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలని, లేనియెడల స్థానిక సమస్యలపై ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు రాజప్ప, మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేశం, వడ్లకొండ భారతమ్మ, పల్లపు మల్లేష్ ,ఉడుత మైసయ్య, చిప్పల జయమ్మ ,బుజ్జి, కె ఆనంద్, జిన్నా బాలరాజు ,పుల్లూరి పద్మ, మౌనిక, రెడ్యానాయక్ ,విట్టల్ నాయక్, జెర్రల్ల సాయిలు, రేపాక మీనయ్య, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.