కొడుకుపై తండ్రి దాడి

నవతెలంగాణ- చందుర్తి
తండ్రిపై తనయుడు దాడి చేసిన ఘటన మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆవునూరి శంకర్ అనే వ్యక్తికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. ఇందులో భాగంగా అప్పులు ఉండగా తనకున్న ఎకరం భూమిని అమ్ముతానని తండ్రి. శంకరయ్య చెప్పడంతో చిన్న కొడుకు భాస్కర్ భూమిని అమ్మవద్దని పలుమార్లు హెచ్చరించారు దీంతో తండ్రి వినకుండా అమ్ముతానని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీంతో భాస్కర్ పై ఇంట్లో ఉన్న గొడ్డలి తెచ్చి తండ్రి శంకరయ్య భాస్కర్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలు ఐనాయి దీంతో స్థానికులు వేములవాడ ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన పై ఎస్సై అశోక్ కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love