నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను కొడుకు హత్య చేశాడు. యూపీలోని మోహన్‌లాల్‌గంజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జబరులి గ్రామంలో జగదీష్ వర్మ (70), అతని భార్య శివప్యారి (68) నివాసముంటున్నారు. వారి పెద్ద కొడుకు బ్రిష్కిత్ అలియాస్ లాలాతో వారికి ఆస్తి విషయంలో వివాదం నడుస్తోంది. శనివారం రాత్రి వారి మధ్య మళ్లీ వివాదం చెలరేగగా, లాలా సుత్తితో వారిని దారుణంగా కొట్టాడు. ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు.