పెట్రోల్‌ కోసం పాట్లు…

– ట్యాంకర్ల సమ్మెతో బంకుల్లో కొరత
– తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు
నవతెలంగాణ-పుల్కల్‌
పుల్కల్‌ ఉమ్మడి మండలంలో పెట్రోల్‌ కోసం మంగళవారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్యాంకర్ల సమ్మెతో ఏ బంకులో చూసినా.. నోస్టాక్‌ బోర్డులే వెలిశాయి. దాంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఉమ్మడి పుల్కల్‌ మండలంలో ఆరు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. అయితే పెట్రోల్‌ ట్యాంకర్ల సమ్మెతో ఈ బంకు లన్నింటిలో స్టాక్‌ లేకుండా పోయింది. అయితే ముందస్తు సమాచారం లేకుండా.. అకస్మాత్తుగా వెలిసిన నో-స్టాక్‌ బోర్డులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్‌ లేక కొందరు తమ వ్యాపారాలను కూడా బందుపెట్టుకున్నారు. రైతుల దగ్గరి నుంచి మొదలుకుని.. ఉద్యోగుల వరకూ అంద రూ ఇబ్బందులు పడ్డారు. కాగా బంక్‌ యాజమాన్యం ముం దురోజు సమాచారం ఇస్తే.. ఇలా ఇబ్బంది పడేవాళ్లం కాదని వాహనదారులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. బంకుల్లో స్టాక్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Spread the love