ప్రచారంలో పడరాని పాట్లు…

– ఓట్లు కోసం నాయకుల ఫీట్లు…

– గేదె ను కడిగి,పేడ ఎత్తి ప్రచారం…
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎన్నికల ప్రచారం లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఇస్త్రీ చేయడం,క్షవరం చేయడం,హోటల్ లో దోసెలు వేయడం చేసేవారు.మన చూసేవాళ్ళం. ఇంకా కొత్తదనం గా చేయాలనుకున్నారు అశ్వారావుపేట ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి. ప్రచారం చేస్తూ ఉండగా ఇంటి దగ్గర ఒక యజమాని తన గేదె ను నీళ్ళతో శుభ్రం చేస్తుండగా అది చూసిన ఎం.పి.పి తానే ఆ పనికి పూనుకున్నారు. రెండో రోజు ఇంకా వింతగా ప్రచారం చేయాలనుకున్న ఆయన మేతకు బయలు దేరిన గేదెలు పేడ వేస్తూ పోతుంటే ఈయన తీస్తూ ఫొటోలకు ఫోజు ఇచ్చాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నారని సహచరుల దగ్గర కూపీ లాగితే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈయన ను నమ్మడం లేదని,ఎలానో ఒకలా ఆయన అపనమ్మకం దృష్టి ని మార్చడానికి ఈ పాట్లు అని లోగుట్టు బహిర్గతం అయింది. ఇక పోతే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీరాభిమాని మోటార్ మోహన్ ఎమ్మెల్యే,మంత్రి ముఖాలను ను పోలిన బొమ్మలను కార్యకర్తల ముఖాలకు తొడుక్కుని ప్రచారం నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.
Spread the love