ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా సోనియా గాంధీ  జన్మదిన వేడుకలు…

– ఉస్మానియా జెఎసి చైర్మన్ జంపాల రాజేష్
నవతెలంగాణ -హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాత  సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉస్మానియా ఉద్యమ నేత జంపాల రాజేష్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంపాల రాజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనను అంతమొందించి ప్రజల పాలనను తీసుకురావడంలో నిరుద్యోగ విద్యార్థులు క్రియాశీలక  పాత్ర పోషించారని తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరంతరం కృషి చేశారని చెప్పారు. టి ఎస్ పీఎస్ సి ని వెంటనే ప్రక్షాళన చేసి నోరుద్యోగులకు, విద్యార్థులకు తగిన న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  భూషణ్, బచ్చన్న ,శేఖర్, నరేష్ ,భరత్ తదితరులు పాల్గొన్నారు
Spread the love