ప్రజల ఆకాంక్షను సఫలం చేసిన ఘనత సోనియా గాంధీ కె దక్కుతుంది

– దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-తొగుట : ప్రజల ఆకాంక్షను సఫలం చేసిన ఘనత సోనియా గాంధీ కె దక్కుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొ న్నారు.శనివారం మండలం లోని అంబెడ్కర్ విగ్ర హం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ,రేవంత్ రెడ్డి చిత్ర పంటలకు పాలాభిషేకం చేశారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలో తీసుకురావడం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా ఈరోజు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆర్టీసీ బస్సులలో మహిళ లకు ఉచిత రవాణా కల్పించడంతో పాటు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు అమలు చేయ డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.మరిన్ని పథకాలను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగుట ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్కం స్వామి,తొగుట సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి,నిరంజన్ రెడ్డి, నర్సింహులు,గంటా రవీందర్,నర్సింలు,లింగాల కృష్ణ, జీడిపల్లి స్వామి,కిషన్,నాగరాజు,కాసర్ల నర్సింలు,బాలమల్లు,ఉప్పలయ్య,రమేష్,బషీర్, స్వామి,నవీన్,అనిల్,సంతోష్,రాములు,అశోక్, బాబు,నరసవ్వ,కుంభాల రవి,తిరుపతి రెడ్డి,కొబ్బ రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love