నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఫోన్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈరోజు భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.