– సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-చివ్వేంల : మండల వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. సోనియాగాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని హస్తం పార్టీ బలోపేతం కోసం ఆ భగవంతుడు మరింత బలం చేకూర్చాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతమల్ల రమేష్, వెన్న మధుకర్ రెడ్డి, అప్పి రెడ్డి, నంద్యాల నరేష్ రెడ్డి, వేముల చిన్న, సమీర్,అనిల్,సంజీవ,జానకీరాములు,