నవతెలంగాణ-జమ్మికుంట : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో శనివారం స్థానిక సివిల్ ఆస్పత్రిలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు ఆసుపత్రిలోని పేషెంట్లకు పంపిణీ చేశారు. పట్టణంలోని శివాలయము, రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మికుంట బస్టాండ్ లో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని మహిళలతోని కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య ,జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కసుబోసుల వెంకన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వరరావు, నాయకులు సారంగం పాణి, అరకల వీరేశలింగం,పొనగంటి రవీందర్, రమేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.