ఆత్మకూరు లో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-ఆత్మకూరు
మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ ఆత్మకూరు మండలం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేంద్రంతోపాటు అక్కంపేట చౌల్లపల్లి నాగయ్య పల్లి, పలు గ్రామాల్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మకూరు కొత్త బస్టాండ్ వద్ద ముందుగా బాణా సంచను కాల్చి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. సందర్భంగా పలువు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి రుణం తీర్చుకున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం,10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్, జెడ్పీటీసీ కక్కేర్ల రాధిక రాజు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వర్షం వరుణ్ గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బీరం సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ పిఎ సి ఎస్ చైర్మన్ ఎరుకొండ రవీందర్ గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ ముద్ధం సాంబయ్య, చౌళ్ళపల్లి సర్పంచ్ కంచె రవికుమార్, బిసి సంక్షేమ సంఘం నాయకులు భయ్య తిరుపతి,మండల అధికార ప్రతినిధి ఎండి గఫూర్,మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్, హౌజుబుజుర్గు మాజీ సర్పంచ్ షేక్ ఇమామ్,మండ కుమారస్వామి, దామేర రాజు, మౌళ , భస్కీర్ ,పిఏసిఎస్ కే డైరెక్టర్ రేవూరి జయపాల్ రెడ్డి, యూత్ నాయకులు తనుగుల సందీప్, మైపాల్ రెడ్డి,బరుపట్ల కిరీటి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love