నవతెలంగాణ- ఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు మోడీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. పి.వి.కి భారతరత్న ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. పి.వి.తో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎంస్ స్వామినాథన్‌లకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖుల సహకారాన్ని గుర్తు చేసుకుంటూ వారికి భారతరత్న ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా మూడు వేర్వేరు ట్వీట్లు చేశారు. పీవీ సహా వారికి భారతరత్న రావడంపై సోనియా గాంధీని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆమె సమాధానం చెబుతూ… వారికి భారతరత్న రావడాన్ని స్వాగతిస్తున్నాం… తాము ఎందుకు స్వాగతించం? అని సోనియా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.