నెహ్రూకు సోనియా, ఖర్గే, రాహుల్ నివాళులు..

నవతెలంగాణ – ఢిల్లీ : భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాళులు అర్పించారు. సోమవారం ఉదయాన్నే ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్‌కు వెళ్లి ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. మల్లిఖార్జున్ ఖర్గే, సోనియాగాంధీ ఇద్దరూ ఒకేసారి శాంతివన్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. తరువాత మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ తమతమ అధికారిక ఎక్స్‌ ఖాతాల ద్వారా కూడా నెహ్రూకు నివాళులు తెలియజేశారు.

Spread the love