గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన సోనియా, రాహుల్, ప్రియాంక

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటీవల మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించి ఓదార్చారు. నిన్న తాజ్‌కృష్ణ హోటల్‌లో గద్దర్ భార్య విమల, కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, ఆయన భార్యను నేతలు పరామర్శించారు. ఈ సదర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని తల్లి సోనియా, సోదరి ప్రియాంకకు చెప్పారు. గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిజానికి సోనియా గాంధీనే గద్దర్ కుటుంబ సభ్యులను కలవాల్సి ఉంది. అయితే, ఆరోగ్య కారణాలరీత్యా గద్దర్ కుటుంబ సభ్యులను హోటల్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్ పోరాడారని కొనియాడారు.

Spread the love