నవతెలంగాణ – హైదరాబాద్ : త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి ముగ్గు పోస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో 53శాతం ఇళ్లకు మంచినీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని, వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామని వరంగల్‌లో అన్నారు.