నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ లభిస్తుందని భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో తన సోదరికి బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న కవిత 11 కిలోలు తగ్గినట్లు చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశాక ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసులో మనీశ్ సిసోడియాకు ఇప్పటికే బెయిల్ లభించినట్లు చెప్పారు.