యూఎస్ఏపై దక్షిణాఫ్రికా విజయం..

నవతెలంగాణ – హైదరాబాద్: T20 వరల్డ్ కప్ సూపర్-8 తొలి మ్యాచులో యూఎస్ఏపై దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన SA 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డికాక్(74), మార్క్రమ్(46) రాణించారు. చేధనలో యూఎస్ఏ 176 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ గౌస్(80) చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ రబడ 3 వికెట్లు తీశారు.

Spread the love