పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి ఏటా జూన్ తొలి, రెండో వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి. నెలలో పక్షం రోజులు గడిచిపోయి మూడు రోజులవుతున్నా నేటికీ వాటి జాడే లేదు. కర్నాటక, రాయలసీమ ప్రాంతా లకు వరకు విస్తరించిన రుతు పవ నాలు ఆ తర్వాత ముందడుగు వేయ టంలేదు. అక్కడే తచ్చాడుతున్నాయి. ఈనెల 19వ తేదీ తర్వాతనే తెలం గాణలోకి అవి ప్రవేశించే సూచనలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు వేచిచూడాల్సిందే. మరోవైపు అన్నదాతలు విత్తనాల కోసం దుక్కు లు దున్ని, అచ్చులు తోలి, విత్తనం తెచ్చి వాన రాక కోసం కొండంత ఆశతో ఎదు రుచూస్తున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రోజూ చెబుతున్నా.. చినుకు జాడ కానరావ డం లేదు. జూన్ 17 వచ్చినా రాష్ట్రం లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడి గాల్పుల తీవ్రత ఇంకా కొనసాగు తూనే ఉన్నది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని హైద రాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరి కలు జారీ చేసింది. జాబితాలో భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్,కొమ్రంభీమ్, మంచిర్యా ల, కరీంనగర్, పెద్దపల్లి, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా లున్నా యి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కల పల్లిలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
మరోవైపు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో కేవలం నాలుగు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురి సింది. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో అత్యధికంగా వాన పడింది.