నవతెలంగాణ – హైదరాబాద్: మరో 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రుతుపవనాలు ముందే వస్తున్నా కేరళ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతుంది. కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. కర్ణాటక, ఏపీ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు జూన్ 5 నాటికి, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ఎగువభాగం, పశ్చిమబెంగాల్‌కు జూన్ 10న చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది.