నవతెంగాణ – అమరావతి : కొన్ని నెలలుగా తీవ్ర ఉష్ణోగ్రత, వడగాల్పులతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందజేసింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు శ్రీహరికోట, సమీప ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని వివరించింది. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.