– ఇప్పటికే 65 బెండల చైనా మాంజా స్వాధీనం, కేసు నమోదు
నవతెలంగాణ – కామారెడ్డి
ఎవరైనా చైనా కలిగి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. గురువారం నేను మాట్లాడుతూ.. ఇదివరకే చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, అయినప్పటికీ అక్కడక్కడా కొంత మంది అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం ఉందన్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక కేసు నమోదు చేసి 65 బెండల్స్ చైనా మాంజా సీజ్ చేయడం, కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవ్వరి వద్దనైనా అట్టి చైనా మాంజా ఉన్నట్లయితే వారు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ యందు అప్పగించలని, లేనియెడల చైనా మాంజా ఎవ్వరైనా అమ్మిన, కలిగిఉన్న, ఉపయోగిస్తున్నట్టు సమాచారం అందినట్టయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు సి సి యస్ సిబ్బందితో దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎవరైనా చైనా మాంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఒక ప్రకటనతో తెలిపారు. రాబోయే సంక్రాంతి పండగ సందర్భంగా చైనా మాంజ విక్రయించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని, నైలాన్, సింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో పర్యవరణానికి విపత్తుగా మారడం తో పాటు చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని , చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. చైనా మాంజను ఉపయోగించి గాలి పటాలు ఎగురవేసే క్రమంలో ఎన్నో పక్షులు, సాధారణ ప్రజలు కూడా ప్రమాదానికి గురవుతారు. అదే క్రమంలో గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడ ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా ఉందన్నారు. ఎవ్వరికైనా ఎలాంటి సమాచారం ఉన్నను టాస్క్ ఫోర్స్ లేదా సిసియస్ సిఐ శ్రీ శ్రీనివాస్ 8712686112 నెంబర్కు సమాచారం అందించలాన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.