నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన స్పీకర్‌ పోచారం

నవతెలంగాణ-కామారెడ్డి: వర్షాలు ఆలస్యమైనప్పటికీ నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రాజెక్టు పరిధిలో సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్‌ కోసం నిజాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కుల నీటిని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సాగర్‌లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. అవసరమైతే మరో 5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి తెప్పించి.. ఆయకట్టు కింద ఉన్న 1.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అంగీకరించారని వెల్లడించారు.

Spread the love