అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

నవతెలంగాణ-  బాల్కొండ
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా   మంగళవారం బాల్కొండ గ్రామపంచాయతీ వద్ద ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణకు గ్రామంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. అందులో భాగంగా ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయం, పోచమ్మ గల్లీలోని మహాలక్ష్మి మందిరం వద్ద కేంద్రాలను సిద్ధం చేసి అక్కడ 32 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ గ్రామస్తులు ఈ మూడు కేంద్రాల వద్ద ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తెలిపారు.
Spread the love