నవతెలంగాణ – ధర్మసాగర్
విష జ్వరాలు ప్రబలకుండా మండల ప్రజలు దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిడిఎమ్ఓ డాక్టర్ కవిత అన్నారు.గురువారం మండలంలోని దేవునూరు గ్రామంలో వర్షాకాలంలో వచ్చు విష జ్వరాల దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యగా ధర్మసాగర్ మండలం వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో ఈగలతో, దోమలతో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈగలు దోమలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే విశ్వ జ్వరాల బారిన పడకుండా ఉంటారని సూచించారు. ఈ సందర్భంగా గ్రామాలలో దోమల నివారణ గురించి అవగాహన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ యన్.విజయలక్ష్మి,సదిరం విజయ, సిహెహ్. సత్య ప్రకాష్, ఆశ వర్కర్లు పాల్గొనడం జరిగింది.