స్పెషల్‌ క్యాస్వెల్‌ లీవ్‌ ఇవ్వాలి

– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు స్పెషల్‌ క్యాస్వెల్‌ లీవ్‌ ఇవ్వాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు అధికారులకు గురువారం నినతి పత్రం అందజేశారు. 29, 30వ తేదీల్లో సింగరేణి ఉద్యోగస్తులను ఎలక్షన్‌ డ్యూటీలో వినియోగించుకుంటున్న వారికి ఆ మరునాడు డిసెంబర్‌ 1వ తేదీన స్పెషల్‌ క్యాస్వెల్‌ లీవ్‌ ఇవ్వాలని జీఎం. పర్సనల్‌ హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి నవంబర్‌ 29, 30 తేదీల్లో ఎలక్షన్‌ డ్యూటీలో పనిచేసిన వారికి డిసెంబర్‌ 1వ తేదీన స్పెషల్‌ క్యాస్‌ వెల్‌ లీవ్‌ ఇస్తున్నారని తెలిపారు. సింగరేణి అధికారులు మాత్రం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని అన్నారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే మరోసారి పునరాలోచించి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా డిసెంబర్‌ 1వ తేదీన స్పెషల్‌ లీవ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధి కారి, జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నర్సింహారావు కోరారు.

Spread the love