– ఆవిష్కరించిన బీవీ.రాఘవులు, తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభ ఈ నెల 25-28 తేదీల్లో సంగారెడ్డిలో జరుగుతున్నందున ‘నవతెలంగాణ’ ప్రత్యేక సంచికను తీసుకొచ్చింది. మహాసభ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన ప్రజా పోరాటాలు, సాధించిన విజయాలకు సంబంధించి ఆర్టికల్స్‌తో పాటు పలువురు ప్రజానాయకుల ఇంటర్య్యూలతో కూడిన ప్రత్యేక సంచికను శనివారం పీఎస్‌ఆర్ గ్రౌండ్‌లో జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ బహిరంగ సభలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, టి.జ్యోతి, మల్లు లకిë, అబ్బాస్, పాలడుగు బాస్కర్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌తో కలిసి సభావేదికపై ఆవిష్కరించారు. నవతెలంగాణ మెదక్ రీజియన్ మేనేజర్ రేవంత్‌కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతీ య ప్రతినిధి మేకల కృష్ణయ్య, డెస్క్ ఇన్‌చార్జి అనిల్‌కుమార్, రిపోర్టర్స్ సుదర్శన్‌రెడ్డి, బి.శ్రీనివాస్, ఏడివిటి బాధ్యులు మల్లేశం, ప్రవీణ్ పాల్గొన్నారు.