
– మేడారంలోని రహదారులను పరిశీలించిన పోలీస్ అధికారుల బృందం
నవతెలంగాణ – తాడ్వాయి
వచ్చే నెల ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగు మేడారం మహా జాతర కు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ అన్నారు. జిల్లా పోలీసు అధికారులతో కలిసి మేడారంలోని రద్దీగా ఉండే ప్రదేశాలు, రహదారులను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ మేడారం జాతర టైంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అనుభవంగల పోలీస్ ఆఫీసర్లను సిబ్బందితో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రిపేర్లకు గురి అయ్యే పాత వాహనాలను వెంటనే తొలగించి ప్రత్యేక వాహనాల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహా జాతరలో వినూత్న పద్ధతిలో ట్రాఫిక్ నియంత్రణ చేయనట్లు తెలిపారు. ప్రతి రెండు కిలోమీటర్ల దూరం ఒక యూనిట్ గా విభజించి పదిమంది కానిస్టేబుల్స్ ని ఇద్దరు ఎస్ఐ స్థాయి గల అధికారులు నియమించినట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాలను సులువుగా గుర్తించడం కోసం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు గురికాకుండా స్థానిక గ్రామాల పేర్లతో పాటు పార్కింగ్ స్థలాలకు ప్రత్యేక గుర్తింపు గల సింబల్ ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే దారులను బయటకు వెళ్లే దారులను గుర్తించడం కోసం రూట్ మ్యాప్ లను వివిధ నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించి పర్యవేక్షణ చేయనున్నట్లు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం, ఫింగర్ ప్రింట్ బ్యూరో వంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా వచ్చి వనదేవతలను దర్శించుకుని ఎవరి ఇండ్లకు వారు వెళ్ళవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పీ ఆర్ సదానందం, డిఎస్పీ రవీందర్, ఎస్బీ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, పస్రా సిఐ శంకర్ స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.