ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

– గెలుపు కోసం ఆశీస్సులు అందించండి మీ సేవలో నేనుంటా,మూడు రాష్ట్రాల సరిహద్దు లో గల సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు,

నవతెలంగాణ- మద్నూర్
త్వరలో జరగబోయే జుక్కల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆశీస్సులు అందించండి మీ సేవలో నేనుంటానని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే మూడు రాష్ట్రాల సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం నాడు హనుమంతు సిండే కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గెలుపు కోసం మరోసారి మీ ఆశీస్సుల అందించాలని ఆ భగవంతునితో కోరుకున్నారు ఎల్లవేళలా మీ సేవలోనే నడుస్తానని ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచిన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆ భగవంతునితో కోరుకోవడం ఎమ్మెల్యే సతీమణి శోభ హనుమంతు షిండే భర్త గెలుపుకు ఆశీస్సులు అందించాలని కోరుకోవడం మా తండ్రి గెలుపుకు మీ ఆశీస్సులు అందించాలని ముగ్గురు కుమారులు కోరుకోవడం ఆ దంపతులతో పాటు బిచ్కుంద మద్నూర్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే హనుమంతు షిండే గెలుపుకు కోరికలు తీర్చే ఆంజనేయస్వామి మీ ఆశీస్సులు అందించాలని కోరుకున్నారు.

Spread the love