కొడిచర చెన్నమ్మ కోరివీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలం లోని కొడిచర గ్రామ శివార్లలో గల ప్రసిద్ధి చెందిన చెన్నమ్మ కోరి వద్ద వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వీరభద్రస్వామివారికి అన్న పూజలు చేపట్టారు. విగ్రహానికి అన్నంతో అలంకరణ చేశారు. పొట్టెవార్ రాచప్ప కుటుంబ సభ్యులు, భక్తులు పూజలు చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థ, అన్న ప్రసాదం అందజేశారు. చెన్నమ్మ కోరి  దైవాన్ని కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు  విశ్వసిస్తారు.
Spread the love