మైసిగండి పెద్ద వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు

నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండలంలోని మైసిగండి గ్రామంలో కొలువై ఉన్న పెద్ద వినాయకుని వద్ద సోమవారం తొలి రోజు మండప నిర్మాణ దాత జటావత్‌ కిషన్‌ నాయక్‌ భారతి దంపతులు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహ రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌, జిల్లా నాయకులు జవాహర్‌ లాల్‌ నాయక్‌ తదితరులు హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా పూజకు విచ్చేసిన ప్రముఖులను గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షులు హీరాసింగ్‌ నాయక్‌ పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love