మద్నూర్ మండల కేంద్రములో కార్తీక మాసం ప్రభాత్ పెరి 40 సంవత్సరాల నుండి గ్రామ సాంప్రదాయ ప్రకారం ప్రభాత్ కొనసాగిస్తూనే వున్నారు. శ్రీ బాలాజీ మందిరములో ప్రతిరోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండి వాడవాడలో గోవిందా నామములు, శ్రీ రాముని విట్టలేశ్వరుని, మహాదేవుని భజనలు చేస్తూ గ్రామములో గల అన్ని దేవాలయాలలో, 3 కీ. మీ దూరములో ఉన్న రేణుక మాత సోమలింగేశ్వరా శివాలయంలలో మంగళ హరతులు నిర్వహిస్తారు. శనివారం రోజున మద్నూర్ గ్రామనికి 5 కి, మీ దూరంలో గల తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో వున్నా మీర్జాపూర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి సరిహద్దులోని శివాలయం వరకు భజన, భక్తి గీతాలతో ప్రభాత్ పెరి చేస్తూ అక్కడ మంగళ హరితులు చేసి, అనంతరం మద్నూర్ శ్రీ బాలాజీ మందిరంలో నారాయణ నారాయణ, హరి హోం భగవతే వాసుదేవ శ్లోకాలు అంటూ అనంతరం మహా మంగళ హరతులు చేశారు. మహిళకు 365 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. నిర్వాహకులు గోవింద్ ప్రసాద్ కాకాని, హనుమాన్ శర్మ కండక్టర్ గంగాధర్ రచ్చ కుశాల్ కె.వెంకటేష్ శంకర్ సంధుర్వర్ డాక్టర్ రమణ, ఊడ్తా సురేష్ అనిల్ పరిక్,మొధాని,ప్రభాత్ పెరి ముందుండి కొనసాగిస్తున్నారు పెద్ద ఎత్తున భక్తులు మహిళలు, యువత, యువకులు, చిన్న పిల్లలు పాల్గొంటున్నారు.