నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారo హనుమాన్ జయంతి సందర్భముగా శ్రీఅభయఆంజనేయస్వామికి 108 కళాశాలతో పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకo నాగవళ్ళీదలార్చన, (ఆకుపూజ), సింధూరార్చన, విశేష పుష్పార్చన, స్వామినామ సంకీర్తనలతో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేకలబండ వద్ద గల ఉన్న భారీ విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహ దాత గుత్తా జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి రేకుల మంటపాన్ని నిర్మిస్తామని చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ బాబు , శ్రీనివాస్ దంపతులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.