పాత నేరస్తులు, రౌడీ షీటర్స్‌పైన ప్రత్యేక నిఘా

ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ వికారాబాద్‌ ప్రతినిధి
పాత నేరస్తులు, రౌడీ షీటర్స్‌పైన ప్రత్యేక నిఘా పెట్టిన ట్టు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. జిల్లాలోని పోలీస్‌ అధికారు లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికలలో అయిన కేసుల ఒక్క వివరాలను, అలజడులను గురించి పోలీస్‌ స్టేషన్‌ల వారీగా అధికారులతో చర్చించారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో పని చేసి ఇతర జిల్లాలకు బదిలీపైన వెళ్లిన, ప్రమోషన్‌ పొందిన అధికారులను ఎస్పీ సన్మానిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో జిల్లా లోని ప్రతి ఒక్క పోలీస్‌ అధికారి అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ, తమ పోలీస్‌ స్టేషన్‌ లలో సమస్యాత్మక గ్రామాలు, పట్టణాల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కేసులను పెండిం గ్‌లో పెట్టొద్దని అన్నారు. పోలీస్‌ అధికారులు ఏ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయం పట్ల దృష్టి కేంద్రీకరించాలన్నారు. అప్పుడే ప్రజలకు అన్నీ విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. పోలీస్‌ అధికారులందరూ రో డ్డు ఆక్సిడెంట్‌లు, ఆత్మహత్యలు జరుగుటకు కారణాలు తెలు సుకొని వాటిని తగ్గించాలని సూచించారు. ఎక్కువగా నమో దు అవుతున్న పోలీస్‌ స్టేషన్‌లలో కళాజాత బృందం అధికా రులతో ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. సీసీటీవీపై కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్‌, వికారాబాద్‌ సబ్‌ డివిజన్‌ అదనపు ఎస్పీ సత్యనారాయణ, పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, తాండూర్‌ డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love