మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు

నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండల ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ తరఫున అధ్యక్షులు పేరునాకి నవీన్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైస్‌ ఎంపీపీ కేవీ రావు, ఉప సర్పంచ్‌ పుచ్చకాయల శంకర్‌లు మాట్లాడారు. న్యాయం వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. పాయం వెంకటేశ్వర్లుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అందులో మణుగూరు మండలంలో వున్న 66, బూత్‌లో వున్న ప్రజలు అత్యధికంగా 12,000 అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మండల కాంగ్రెస్‌ పార్టీ రుణపడి ఉంటుంది అన్నారు. మండల ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు, సిపిఐ, టీడీపీ, టీజెస్‌, వైఎస్‌ఆర్‌ టీపీ పార్టీ అభిమానులకు, వ్యాపార వేత్తలకు, ప్రజా సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు, టౌన్‌ అధ్యక్షులు భువనగిరి శివ సైదులు, సింగారం ఉపసర్పంచ్‌ పుచ్చకాయల శంకర్‌, సీనియర్‌ నాయకులు సామా శ్రీనివాస్‌ రెడ్డి, పాలమూరు రాజు, ఆవుల సర్వేశ్వరరావు, లక్ష్మణ్‌, ఐఎన్‌టియుసి వెంకటరత్నం, ఉపసర్పంచ్లు వెంకట్రావు గౌడ్‌, కనకయ్య, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, రామ్‌ రెడ్డి, బల్లెం సురేష్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love