అధికారులను అప్రమత్తం చేసినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు: పస్కా నరసయ్య

నవతెలంగాణ – ఆర్మూర్
రైతుల వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు జరిగేలా అధికారులను అప్రమత్తం చేసినందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎంపిపి పస్కా నరసయ్య అన్నారు.. మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం యందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని, పిప్రి గ్రామంలో 23గొర్ల యూనిట్ లు రెండవ విడత లో ఇప్పించినందుకు,మండలంలో అధిక వర్షాలకు పాడైన రోడ్లు ను మరమ్మత్తులు చేయించినందుకు,మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఆర్మూర్,ఆలూరు మండలాల తహసిల్దార్లకు బిసి లోనుకు అవసరమైన కులం, ఆదాయం, సర్టిఫికెట్ జరిచేయడంలో చొరవ చూపి తొందరగా మంజూరు చేయాలని కొరినారు. దెగాం ప్రభుత్వ దవాఖాన సిబ్బంది కష్టపడి ఎంక్వస్ కు సెలెక్ట్ అయ్యేలా కృషి చేసిన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపినారు దశాబ్ది ఉత్సవాల ల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, విజయ స్ఫూర్తి తో పాల్గొని విజయవంతం చేయాలని కొరినారు. ఈ సమావేశంలో జడ్పిటిసి మెట్టు సంతోష్, ఎంపీడీవో శ్రీనివాస్ ,ఎంపీటీసీ లు ఎం సి గంగారెడ్డి, హన్మాండ్లు, మహేందర్, సురేష్, ముక్తర్,రాజ్ కుమార్,బల్ నర్సయ్య, నందిపేట లావణ్య, రాటం శిరీష తదితరులు అధికారులు పాల్గొన్నారు..

Spread the love