ఐ.డీ.ఓ.సీ(కలెక్టరేట్)లో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు

నవతెలంగాణ-కంటేశ్వర్:
వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం (కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ శాఖల ఆధ్వర్యంలో కొనసాగిన పూజ కార్యక్రమాలలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా వినాయక ఉత్సవాలు జరిపేలా నిర్వాహకులు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే రెండవ రోజైన మంగళవారం ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి రమేష్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Spread the love