ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

– జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరు అందరిని ఆకర్షించిన హైదరాబాద్ నాట్య బృందం
– ఉదయం 11 గంటలకు గణపతి హోమం ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
– మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదానం
– నాలుగు గంటల నుండి 7 గంటల వరకు నాట్య ప్రదర్శన
– ఏడు గంటల నుంచి 9 గంటల వరకు మల్లన్న గుట్ట బసవలింగ స్వామి ప్రవచన
నవతెలంగాణ – మద్నూర్
ఈ నెల రెండు నా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరగా ఈనెల 21న జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణంలో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉదయం 11 గంటలకు గణపతి హోమంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిని బంగారు బాటలు ముందుకు తీసుకువెళ్తూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి రంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని వారు పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకల్లో జుక్కల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల పరిధిలో గల ధూపా దీప నైవేద్య పూజారులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమానికి సలాబద్పూర్ గ్రామ సర్పంచ్ షేక్ గఫర్ ఆధ్యాత్మిక దినోత్సవం వేడుకల విజయవంతానికి ప్రత్యేకంగా కృషి అందించడం ఆయనకు ఎంపీ ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ కార్యక్రమం జుక్కల్ నియోజకవర్గం లోని ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు సర్పంచులు ఎంపిటిసిలు పార్టీ మండల అధ్యక్షులు దేవాదాయ ధర్మదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మేడం సలాబత్పూర్ ఆలయ అధికారులు వందలాదిగా తరలివచ్చిన జనాలు పాల్గొనడంతో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు విజయవంతం కావడం బి ఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అయింది.

Spread the love