వృద్ధుడితో ఉమ్మి నాకించి, చెప్పుల దండ వేసి ఊరేగింపు

నవతెలంగాణ-హైదరాబాద్ : వృద్ధుడి మెడలో చెప్పుల దండ వేసి పశువులాగా ఊరేగించారు. అంతేగాక బలవంతంగా ఉమ్మి నాకించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తిఘరా గ్రామానికి చెందిన 75 ఏళ్ల మొహబ్బత్ అలీ తన కుమార్తెను అసభ్యకరంగా పట్టుకుని వేధించినట్లు ఒక వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అలీ ఇంటికి వెళ్లారు. అతడ్ని బయటకు ఈడ్చుకుని వచ్చారు. ముఖానికి నల్ల రంగు పూశారు. మెడలో చెప్పుల దండ వేసి పశువుగా లాక్కెళ్లి ఊరేగించారు. ఆ తర్వాత అతడితో నేలపై ఉమ్మి వేయించి బలవంతంగా నాకించి క్షమాపణలు చెప్పించారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. జాఫర్, అమన్ పాండే, అఖిలేష్ సాహ్ని, ఘనశ్యామ్ తివారీని నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love