స్పోర్ట్స్‌ కిట్స్‌ చరిత్రాత్మకం!

Sports kits are historic!– మొదలైన క్రీడా సామాగ్రి పంపిణీ
– శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ గ్రామీణ క్రీడాకారులు, యువతకు ప్రోత్సాహం అందించి, పతక వేటలో సంకల్ప బలం అందించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌)లు ‘కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌’ను ప్రతి గ్రామానికి అందజేస్తున్నాయని శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. ‘ తెలంగాణకు తలమానికంగా మారిన రైతు బంధు, రైతు భీమా, కేసీఆర్‌ కిట్స్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌ సరసన కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌ నిలువనుండటం సంతోషం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామానికి, ప్రతి క్రీడా ప్రాంగణానికి సమగ్ర స్పోర్ట్స్‌ కిట్లను అందజేయటం చరిత్రాత్మకం. రూ.100 కోట్లకు పైగా వ్యయంతో యువతకు క్రీడా కానుక అందించటం హర్షనీయం. గ్రామీణ క్రీడాకారులకు ఇది ఎంతో మేలు చేయనుందని’ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల స్పోర్ట్స్‌ కిట్లను పంపిణీ చేయనుండగా.. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా లోని హన్వాడ మండల కేంద్రంలో కార్యక్రమాన్ని అధి కారంగా ప్రారంభించారు. క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, క్రీడాశాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కలెక్టర్‌ రవి నాయక్‌లు స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించారు. కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌లో రూ. 50 వేల విలువ చేసే 23 క్రీడా పరికరాలు ఉన్నాయి. ప్రతి కిట్‌లో భాగంగా 75 టీ షర్ట్‌లను సైతం అందజేయనున్నారు.

Spread the love